KCR:సంక్షోభంలో వ్యవసాయం

12
- Advertisement -

వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించిన కేసీఆర్….గోదావరి నది మీద నిర్మించిన ప్రాజెక్టులు సజీవ జల ధారలు.. అలాంటిది నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఎడారి అయిందన్నారు.

మిడ్ మానేరు బ్రిడ్జి సముద్రంలా ఉండేది, ఇప్పుడు ఎండిపోయింది…ప్రస్తుత ప్రభుత్వ తెలివి తక్కువతనం వల్లే ఇలా జరిగిందన్నారు. 2014 కన్నా ముందు ఉన్న పంటలు ఎండని జిల్లా లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన తెలంగాణ అయ్యిందన్నారు.

నాలుగు నెలల్లోనే ప్రాజెక్టులు ఎడారిలా మారాయి.. కరవు పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లే కరవు వచ్చింది… గోదావరిని నిండుగా ప్రవహించేలా చేశాం అన్నారు. కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు… సిగ్గు లేకుండా ఇవాళ మరికొన్ని హామీలు ఇచ్చారన్నారు.

Also Read:రాజా రవీంద్ర…‘సారంగదరియా’

- Advertisement -