మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం: గుత్తా

53
gutha

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆరే సీఎం అని స్పష్టం చేశారు శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా.. 2023లో తమదే అధికారం అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు మెచ్చేలా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు మంచి భాషతో మాట్లాడాలని హితవుపలికారు. బీజేపీ పెట్రో, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. హైదరాబాద్‌లో తాలిబాన్లు ఉన్నారని చెబుతున్నారని…. మరి ఎన్ఐఏ ఏం చేస్తుందని ప్రశ్నించారు. మతోన్మాదం పేరుతో శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో సమస్యలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.