ప్రతి ఒక్కరు లాక్ డౌన్‌ను పాటించాలి- జగదీష్ రెడ్డి

275

లాక్ డౌన్, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నదని అన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండలో పట్టణ ప్రజలకు నిత్యావసర వస్తువులను,కూరగాయలను,వైద్య సేవలను,పాలు,పండ్లు సరఫరా చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రూపొందించిన ‘మీ కోసం యాప్‌’ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,కలెక్టర్ ప్రశాంత్ పాటిల్,ఆర్‌డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంఆర్‌ఓ నాగార్జున రెడ్డి లు పాల్గొన్నారు.

Jagadish Reddy

సూర్యాపేట పట్టణంలో, నల్గొండ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ల వల్ల ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా తమకు కావాల్సిన వస్తువులను సమకూర్చుకుంటున్నరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో ముఖ్యంగా ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉందని మంత్రి అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో వాహనదారులపై సోడియం హై పొక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసే టన్నెల్ మిషన్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ద్విచక్ర వాహనంపై సంచరించి నల్గొండ పట్టణంలోని పరిస్థితులను పరిశీలించారు.లాక్ డౌన్ విషయంలో రాజీ పడేది లేదని ప్రజలు,ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు విధిగా లాక్ డౌన్ నిబంధనలు పాటించి తీరాలని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.