ఎంపీ సంతోష్ పేరిట పేదలకు నిత్యాన్నదానం..

283
food distribution

సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎంపీ సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం కార్యక్రమం ప్రతి రోజు కొనసాగుతోంది. వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో 3వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ పేరు మీద ఈ రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కోదురుపాక గ్రామంలో సుమారు వంద మందికి మాజీ ఎంపీటీసీ బొల్లావేని భానుశ్రీ-తిరుపతి సహకారంతో అన్నదానం చెయ్యడం జరిగింది.

సుమారు నేటికి 5 వేల మంది వలస కార్మికుల కడుపు నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు పేద ప్రజల దీవెనలు, సీఎం కేసీఅర్ అండదండలు ఎప్పుడు ఉంటాయని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఒద్దెల మహేందర్,సందుల శ్రీనివాస్, సారంపెళ్లి రవి, కమల్, ఆకుల కర్ణకర్, గుండా సాహెబు, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.