ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే..

136
Jagadish Reddy

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దేనని.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గులాబీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రాష్ట్ర రెవెన్యూ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు విప్లవాత్మకమైనవని మంత్రి అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయడంలో పార్టీ శ్రేణులు చొరవ చూపాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.