కార్పొరేట్లకు మేలు చేసేందుకే కేంద్ర వ్యవసాయ బిల్లు..

135
gutha

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుపై నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్లకు మేలు చేసేందుకే కేంద్రం వ్యవసాయ బిల్లు తీసుకొచ్చిందన్నారు. కేంద్రం దశల వారీగా ఎఫ్‌సీఐ ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది. దశల వారీగా మద్దతు ధర అందించే విధానానికి కూడా మంగళం పాడుతున్నది కేంద్రం అని గుత్తా మండిపడ్డారు.

లాభ నస్టాలతో సంబంధం లేకుండా రైతులకు ఇబ్బంది కాకుండా తెలంగాణలో సీఎం కెసిఆర్ పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర నూతన వ్యవసాయ బిల్లు ముమ్మాటికీ అన్యాయమైనదే.. ఈ బిల్లుతో మార్కెట్ యార్డ్ లు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. పూర్తిగా కార్పొరేట్లకు ద్వారాలు తెరిచింది కేంద్రం అంటూ గుత్తా విమర్శించారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్ కూడా రైతులకు శరాఘాతం వంటిది.

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ విధానంలో వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు ఉచితంగా మార్పిడి చేసే అవకాశం కల్పించడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంటే,కేంద్రం మాత్రం నష్టపరుస్తున్నది. కేంద్రం అణలోచితంగా తీసుకొచ్చిన విద్యా విధానం, జీఎస్టీ, తదితర పథకాలు అన్నీ కూడా రాష్ట్రాల మీద భారం మోపుతున్నాయి. అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతోంది…ఇది సరైంది కాదు అన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి.