సీఎం కేసీఆర్ రైతు శ్రేయోభిలాషి: మంత్రి హరీష్‌

120

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం సిద్దిపేటలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని 546 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు శ్రేయోభిలాషి, రైతు కష్టం తెలిసిన మనిషిగా రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం యేటా 45 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. 70 ఏండ్లలో జరగని పనిని ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో పూర్తి చేసుకున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు మంత్రి హరీష్‌.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల తీరని అన్యాయం చేసిందని.. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. అలాగే బాయికాడ, బోర్లకాడ మీటర్లు పెట్టి కరెంట్ బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని హరీష్‌ మండిపడ్డారు.