మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన మంత్రి ఐకే రెడ్డి..

19
Minister Indrakaran Reddy

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో పురపాలక శాఖ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు, పనులకు నిధులు మంజూరు చేయాల‌ని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్డీలో కేటీఆరఖను క‌లిసిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి… నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో చేప‌ట్టిన, కొత్త‌గా చేప‌ట్ట‌బోయే వివిధ అభివృద్ది ప‌నుల‌ను వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… నిర్మ‌ల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌తో చర్చించడం జరిగిందని, నిధుల మంజూరు కోసం హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట నిర్మ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, మాజీ డీసీసీబీ చైర్మ‌న్ రాంకిష‌న్ రెడ్డి ఉన్నారు.