ఉచితంగా స్టడీ మెటిరీయల్‌: హరిష్ రావు

40
Harish-Rao

సిద్దిపేటలో పోలీస్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న 230 మంది అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందిస్తానని తెలిపారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న వారికి ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ రావు….ఇచ్చిన మాట ప్రకారం నిత్యం ఉదయం అల్పాహారం అందిస్తానని, ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైనట్లుతెలిపారు.రాత పరీక్షల కోసం శిక్షణ అందిస్తామని, మూడునెలల తర్వాత ఫిజికల్‌ ట్రైనింగ్‌ సైతం ఇప్పించనున్నట్లు తెలిపారు. మైదానంలో రన్నింగ్‌ ట్రాక్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.

అంతకముందు పట్టణంలోని 10వ మున్సిపల్ వార్డు పరిధిలో ముదిరాజ్ కులస్థుల సమక్షంలో పెద్దమ్మ దేవాలయ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చేందుకు వీలుగా రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు.