Harishrao:సిద్దిపేట ప్రజల ప్రేమే నా బలం

22
- Advertisement -

సిద్దిపేట ప్రజల ప్రేమే నాకు బలం, శక్తి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట బాబు జగజీవ్ భవన్ లో సిద్దిపేట అర్బన్, నంగునూర్ మండలం లోని శిక్షణ పొందిన 800 మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. సిద్దిపేట ను అన్నింటిలో ఆదర్శంగా నిలిపాం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ సోదరి మణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి అని.. ఈ మహిళ దినోత్సవం రోజున మహిళలందరికి కుట్టు మిషన్స్ పంపిణి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నంగునూర్ మండలం, సిద్దపేట రూరల్, అర్భన్ మండలం, చిన్నకోడూరు మండలం, నారాయణ రావు పేట, మండలం లో వివిధ గ్రామాల్లో గత 6 నెలల క్రితం రెండు బ్యాచ్ లుగా మీ గ్రామాల్లో ఉచితంగా శిక్షణ ఇప్పించాం అన్నారు. ఉచితంగా శిక్షణ ఇచ్చినం, ఉచితంగా కుట్టు మిషన్స్ ఇస్తున్నాం,సిద్దిపేట ఆడపడుచులు ఆర్థికంగా ఎదగాలి మీ స్వంత కాళ్ళ మీద మీరు నిలబడాలి అన్నది నా తపన అన్నారు.

ఆర్థికంగా చేయూత అందించాలని నా ఉడుతా భక్తి సహాయం మీకు చేస్తున్న.. సిద్దిపేట నియోజకవర్గం లో 2200మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చామన్నారు. కుట్టు శిక్షణ ఇచ్చి.. నేడు 10వేల రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ కూడా ఇస్తున్నాం.. మహిళల కోసం గత ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందన్నారు. ఆర్థికంగా మిమ్మలని బలోపేతం చేసేది కావున మహిళ దినోత్సవ రోజున పంపిణీ చేస్తున్నాం అన్నారు. సిద్దిపేట ఆదర్శంగా ఉండాలని నా ఆలోచన…రాష్ట్రం అంతా నీళ్ళు లేక బోర్లు ఎండిపోతాన్నాయి..కాళేశ్వరం తో చెరువులు కుంటలు కళకళలాడుతున్నాయన్నారు.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -