పట్టణ పేదలకు అండగా ప్రభుత్వం: కేటీఆర్

59
ktr

పట్టణ పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీరామ్‌ నగర్‌లో డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్‌ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… పట్ట‌ణ‌ పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను ప్రారంభిస్తున్నామ‌ని వెల్లడించారు.

క‌రోనా కాలంలో వైద్యులు, ఇత‌ర సిబ్బంది అందించిన సేవ‌ల‌ను ప్ర‌భుత్వం ఎప్ప‌టికీ మ‌రిచిపోదు అన్నారు. రెండేండ్ల కింద నారాయ‌ణ‌గూడలో ఐపీఎం ప్రారంభించుకున్నాము. ఆ త‌ర్వాత ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని తెలిపారు.

డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను భ‌విష్య‌త్‌లో జిల్లా కేంద్రాల‌కు విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ర‌క్త ప‌రీక్ష‌లు, మూత్ర ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈ సెంట‌ర్ల‌ను నెల‌కొల్పామ‌ని చెప్పారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో మొత్తం 57 ర‌కాల ర‌క్త ప‌రీక్ష‌ల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు.