ట్రెండింగ్‌లో ’30 రోజుల్లో ప్రేమిండచం ఎలా..?’

93
pradeep

యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. 3 మిలియన్ వ్యూస్‌తో మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

లవ్ స్టోరీకి పునర్జన్మల నేపథ్యం జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు మున్నా. ఆ జన్మలో కలవని జంట..ఈ జన్మలో ఎలా కలిసారనే కాన్సెప్టుతో సినిమా వస్తుంది. ఈ క్రమంలోనే నాటికి నేటికి లింక్ పెడుతూ..అందులోనే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రమైన లాజిక్ పెట్టాడు దర్శకుడు. దాన్నే ట్రైలర్ లోనూ చూపించాడు. అమృత అయ్యర్ కూడా ఈ సినిమాలో బాగానే రెచ్చిపోయింది. ఈ ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేయగా జనవరి 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

30 Rojullo Preminchadam Ela Trailer | Pradeep Machiraju,Amritha Aiyer | Munna | Anup Rubens |SV Babu