కరోనాకు కుల, మతల తేడా లేదు- హరీష్ రావు

364
harish

ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, యఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని కరోనా నియంత్రణకు మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉందన్నారు.

కరోనా రావడానికి కులము మతము అనే తేడా లేదని దీని నివారణకు సోషల్ డిస్టెన్స్ తో పాటు జాగ్రత్తలు వహించడమే తప్ప మరోమార్గం లేదన్నారు. గ్రామాల్లో కరోనా పై తీసుకుంటున్న జాగ్రత్తలు పట్టణాల్లో కనబడడం లేదని అందుకే అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేయాలని వారికి జాబ్ కార్డు లేనట్లయితే తక్షణమే ఇప్పించడం జరుగుతుందని ఉపాధి హామీ పనిచేసే కూలీలకు డబ్బుల కొరత లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.