ఏపీలో బీజేపీలో చేర్చుకోవడం కరెక్టేనా.?

246
- Advertisement -

తెలంగాణలో బీజేపీ నేతలు ఎమ్మెల్యే కొనుగోళ్ల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం అంశంపై బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఏపీలో నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడాన్ని ప్రస్తావించారు. అక్కడ ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరడం కరెక్ట్ అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో చేరడం కరెక్టేనన్నారు.

బీజేపీ నేతలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడ ప్రభుత్వాలను కూల్చేశారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ సహా చాలా రాష్ట్రాల్లో ఇలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ సభ సక్సెస్ కావడంతో బీజేపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. అందుకే ఉద్యోగ సంఘాల నేతల మీద విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించాలా ?

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

- Advertisement -