దేశంలో మళ్లీ లాక్‌ డౌన్‌?

42
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో కూడా కరోనా ముప్పు మళ్లీ పొంచి ఉందన్న భయాందోళనలు ఉధృతమయ్యాయి. చైనాతో పాటు పలు దేశాల్లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF.7 కేసులు తీవ్రరూపం దాల్చడంతో పాటు మన దేశంలోనూ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF.7 కేసులు వెలుగు చూడడంతో మరోసారి దేశంలో లాక్‌ డౌన్‌ విధిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగ్‭దీప్ ధన్‭కడ్‌ లు మాస్క్‌ లు ధరించి కనిపించడంతో దేశంలో మరోసారి లాక్‌ డౌన్‌ తప్పదన్న వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం సైతం కొవిడ్ గురించి వరుస ప్రకటనలు చేయడం, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడం వంటివి ఇలాంటి వాటికి మరింత ఊతాన్ని ఇస్తున్నాయి.

దేశంలో లాక్‌ డౌన్‌ పై ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో దీనిపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ క్లారిటీ ఇచ్చింది. దేశంలో మరోసారి లాక్‌ డౌన్‌ ఉండే అవకాశం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అనిల్ గోయెల్ తెలిపారు. దేశంలో 95శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తయినందున లాక్‌ డౌన్‌ అవసరం లేదన్నారు. మన ఇమ్యూనిటీ చైనీయులతో పోలిస్తే బలంగా ఉందని, టెస్టింగ్‌, ట్రీటింగ్‌, ట్రేసింగ్‌ వ్యూహం అమలు చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం తెలిపే నిబంధనలను పాటించి, ఏమాత్రం ముప్పు లేకుండా చూడాలని అన్నారు. మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గోయెల్ సూచించారు.

- Advertisement -