కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల..

42
Minister koppula

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ధర్మారం మండల కేంద్రంలో 190 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ,షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని.. పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు వారి తల్లిదండ్రులకు భారం కొవొద్దనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథాకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని మంత్రి కొప్పుల తెలిపారు.