కొవిడ్ టీకా వేయించుకున్న మంత్రి ఈటల..

47
Minister Etela

ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హుజూరాబాద్‌లోని ప్రాంతీయ దవాఖానలో కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. రెండో విడుతలో భాగంగా 60 ఏండ్లు పైబడివారితోపాటు దీర్ఘకాలి వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారు.

రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనావేస్తున్నారు. తొలిరోజు 90 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 48 ప్రభుత్వ దవాఖానలు, 45 ప్రైవేట్‌ హాస్పిటళ్లలో కరోనా టీకా వేస్తారు. covin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా ఇవ్వనున్నారు.