‘మ‌ర్యాద క్రిష్ణ‌య్య’గా సునీల్‌ ఫ‌స్ట్ లుక్..

124
Hero Sunil
- Advertisement -

సునీల్ హీరోగా వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఫ‌న్ ఫిల్మ్‌కు ‘మ‌ర్యాద క్రిష్ణ‌య్య’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై కిశోర్ గ‌రిక‌పాటి, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అర్చ‌నా అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర బృందం నేడు ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సునీల్ దేన్నో చూసి షాక‌వుతున్న‌ట్లుగా పోజ్ ఇచ్చారు. టైటిల్ ఆస‌క్తిగొల్పుతుండ‌గా, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఇంప్రెసివ్‌గా అనిపిస్తోంది.

వివేక్ కూచిభొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ మూవీకి సాయికార్తీక్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు. దాము న‌ర్రావుల సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇత‌ర తారాగ‌ణం వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు.

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం: వి.ఎన్‌. ఆదిత్య‌
నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కిశోర్ గ‌రిక‌పాటి, అర్చ‌నా అగ‌ర్వాల్‌
బ్యాన‌ర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: దాము న‌ర్రావుల‌
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిటింగ్‌: వెంక‌ట్ రెడ్డి
ఆర్ట్‌: యాద‌గిరి
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, గ‌ణేష్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

- Advertisement -