ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు తట్టుకోలేరు:ఈటల

245
etela
- Advertisement -

ఈ కాలంలో ఇంత విపత్తు వస్తుంది అని ఎవరూ ఊహించలేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. సికింద్రాబాద్ లోని క కస్తూర్భ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఈటల….ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. జీనోమ్ యుగం రాకెట్ సైన్స్ యుగం అని చెప్పినా కూడా ఎన్ని విజయాలు సాదించినా ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడు అని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు.

కరోనా వచ్చిన తరువాత మానవ సంభందాలు గొప్ప మార్పు వచ్చింది అని అనుకుంటున్నారు. ఈ మార్పు మనిషి భాద్యతను గుర్తు చేసే విధంగా ఉండాలి. ఎవరికి వారు స్వంత లాభం కోసం కాకుండా సమాజ హితం కోసం అందరూ ఆలోచించాల్సిన సమయం ఇది. కొద్ది రోజుల్లో కరోనా తగ్గుమఖం పడుతుందన్నారు.

ఈ వైరస్ కంటే ముందు సార్స్, మెర్స్, ఎబోలా లాంటి ఎన్నో భయానక వైరస్ లు వచ్చాయి. కానీ ఇప్పుడు వాటి కంటే ఎక్కువ ప్రచారం జరిగింది. ఎంత భాధాకారం అంటే సొంత వారు చనిపోతేకూడ దగ్గరికి పోనీ పరిస్థితి వచ్చింది. చైనా, అమెరికా వల్లనే ఇంత ప్రచారం జరిగింది. కరోనాకి చంపే శక్తి లేదు, కానీ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ప్రాణాంతకం. ఆలస్యంగా వస్తే ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. కరోనాకి మొదటి మందు ధైర్యం అయితే, రెండవ మందు ఆక్సిజన్, మూడవ మందు సమాజం అందించే సంఘీభావం. ఈ పాండ్యమిక్ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం అవసరం అని ఈటల రాజేందర్ అన్నారు.

- Advertisement -