మొక్కలు నాటిన మాపేల్ టౌన్ షిప్ 2 అసోసియేషన్ మెంబెర్స్

215
green

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా హరిత భవనాలుగా తీర్చిదిద్దాలి అని మాపేల్ టౌన్ షిప్ 2 అసోసియేషన్ మెంబెర్స్ అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను మాపేల్ టౌన్ షిప్ 2 అసోసియేషన్ మెంబెర్స్ స్వీకరించి , హైదర్షా కోట , హైదర్ గూడా గ్రామం , రాజేంద్ర నగర్ మండలం కాలనీ వాసులు అందరు కలిసి 170 మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు . ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. హరిత భవనాల నిర్మాణంలో తెలంగాణ ఆరోస్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఛాలెంజ్‌ ద్వారా తెలంగాణను మొదటిస్థానంలో నిలబెడుదామన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటితే ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఇళ్లలో పగలు సైతం విద్యుత్‌ వినియోగంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు.