రాష్ట్రంలో ‘బర్డ్‌ ఫ్లూ’ లేదు- మంత్రి ఈటెల

202
Minister etela
- Advertisement -

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం నిమ్స్‌లో ఆధునీకరించిన అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌, ఎంఐఈఎల్‌ అధ్యక్షుడు పీపీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈహెచ్‌ఎస్‌, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200కోట్లు ఖర్చు చేస్తున్నామని.. అదనంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నిధులు కేటాయిస్తున్నాం. రూ.7,500 కోట్లు వైద్యరంగంపై ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.450కోట్లతో నిమ్స్‌లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. వైద్యరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన రెండోదశ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతం అయింది. కేంద్రం ఎప్పుడు వ్యాక్సిన్‌ పంపినా వాక్సినేషన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోజుకు 10లక్షలు మందికి వాక్సిన్‌ ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. వాక్సినేషన్‌ కార్యక్రమం రెండు ఆస్పత్రుల్లో ఉంటుంది. తొలి వ్యాక్సిన్‌ నేనే వేయించుకుంటాను. కొత్త స్ట్రెయిన్‌కు భయపడాల్సిన పనిలేదని’ మంత్రి వివరించారు. ఇక బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తిపై మంత్రి స్పందిస్తూ.. తెలంగాణలో ఎక్కడా ‘బర్డ్‌ ఫ్లూ’ వైరస్‌కు సంబంధించిన ఆనవాళ్లు లేవని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బర్డ్‌ ఫ్లూతో మన రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు.

- Advertisement -