ప్రభుత్వ ధరలకే కార్పోరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం…

179
etela rajender
- Advertisement -

కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి తెలంగాణా ప్రభుత్వం వైరస్ నియంత్రణ , కరోనా చికిత్సలో పకడ్బంధీ చర్యలతో ముందుకు పోతుంది. వైరస్ వ్యాప్తికి తగ్గట్లుగా పరిక్షలు సంఖ్యను పెంచింది తెలంగాణా ప్రభుత్వం.. ఎంతమంది పేషెంట్లు వచ్చినా, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటూ, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసకుని ఉచితంగా కరోనా చికిత్స అందిస్తుంది..మరోవైపు కరోనా వచ్చిన వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్ పడకలను సిద్దం చేసింది ప్రభుత్వం..రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆక్సిజన్ బెడ్లను తెలంగాణా ప్రభుత్వం సిద్దం చేసింది.

కరోనా చికిత్స నేపథ్యంలో ప్రయివేట్ కార్పోరేట్ ఆస్పత్రులు సైతం కరోనా కు చికిత్స అందించేందుకు మానవతా ద్రుక్పతంతో ముందుకు రావాలని , పలుమార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్,అధికారులు విజ్నప్తి చేశారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడవద్దని విన్నవించారు. అంతే కాదు కరోనా చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రులలో సాధారణ వార్డులో ట్రీట్మెంట్ కు 4 వేలు, ఐసీయూ లో 7,500, వెంటిలేటర్ మీద పెడితే 9 వేలు రోజుకు చార్జి చేయాలని నిబంధనలు కూడా వైద్య ఆరో్గ్య శాఖ జారీ చేసింది.. కానీ చాలా ప్రయివేట్ ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవటంతో తెలంగాణా ప్రభుత్వం కార్పోరేట్ , ప్రయివేట్ ఆస్పత్రులపై కన్నెర్ర జేసింది.. పేషెంట్ల నుంచి లక్షల రూపాలయు వసూలు చేయటం, చనిపోయిన బాడీలను సైతం డబ్బులు కడితేనేి ఇస్తామని వేధించటం అడ్వాన్స్ చెల్లించుకుండా పేషెంట్ను చేర్చుకోకపోవటం, రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేయటం, ఇన్సూరెన్స్ అనుమతించక పోవటం .. డబ్బులు కట్టినా భిల్లులు ఇవ్వడం లేదంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల భయాంధోళనలను సొమ్ము చేసుకోవటం పై ఆరోగ్యశాఱ కన్నెర్ర జేసింది. లిఖిత పూర్వక పిర్యాధులు అందంటంతో రెండు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతిని రద్దు చేసింది.మిగిలిన ఆస్పత్రులకు షోకాజు నోటీసులు జారీ చేసింది..

ప్రభుత్వం పదే పదే హెచ్చరించినా,ప్రయివేట్ ఆస్పత్రులు తీరు మార్చుకోక పోవటంతో, అపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ప్రభుత్వం.కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం తో కలిసి రావాలని కోరటమే కాకుండా కార్పోరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో మరోసారి సమావేశం నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేంధర్ .. చివరకు యాభై శాతం పడకలు ప్రభుత్వానికి ఇవ్వాల్సేందేనని స్పష్టం చేయటం తో ,, .. దిగివచ్చిన ప్రయివేట్ యాజమాన్యాల ప్రతినిధులు యాభై శాతం పడకలను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించాయి.. ప్రభుత్వానికి అప్పగించిన పడకల్లో . కరోనా ట్రీట్మెంట్ ప్రయివేట్ ఆస్పత్రులు జారీ చేసిన జీవో 248 ప్రకారం .. సాధారణ వార్డులో ట్రీట్మెంట్ కు 4 వేలు, ఐసీయూ లో 7,500, వెంటిలేటర్ మీద పెడితే 9 వేలు మాత్రమే ఛార్జ్ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.. అందుకోసం శుక్రవారం రోజు వైద్యశాఖ అధికారులు విధివిధానాలను తయారు చేయనున్నారు..ప్రయివేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిర్ణయానికి దిగిరావంటంతో కార్పోరేట్ ఆస్పత్రుల ప్రతినిధులకు మంత్రి ఈటల ధన్యవాధాలు తెలపారు.. ఈ సమావేశంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యులు కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -