రాష్ట్రమంతటా బస్తీ దవాఖానాలు: ఈటల

455
etela rajender
- Advertisement -

ప్రస్తుతం హైదరాబాద్‌లో 225 బస్తీ దవాఖాలు ఉన్నాయని త్వరలోనే రాష్ట్రంలోని ఇతర పెద్ద నగరాలకు బస్తీ దవాఖానాలను విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా బ‌స్తీ ద‌వాఖానాల ఏర్పాటుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఇచ్చిన ఈటల..సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే 350 బ‌స్తీ ద‌వాఖానాలు మంజూరు చేశారని చెప్పారు.

రోజురోజుకు ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుతుంద‌న్నారు. న‌గ‌రంలో అనేక ప్రాంతాల్లో బ‌స్తీలు ఉన్నాయి. ఆ బ‌స్తీల్లో ఉంటున్న పేద‌వారి కోసం బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేశాం. ఢిల్లీలోని మొహ‌ల్లా క్లినిక్‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని బ‌స్తీ ద‌వాఖానాల‌కు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు.

ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు బ‌స్తీ ద‌వాఖానాలు ప‌ని చేస్తున్నాయి… కావాల్సిన మందుల కోసం నెల‌కు రూ. 20 వేలు స‌మ‌కూర్చామ‌ని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో ఒక డాక్ట‌ర్, ఒక స్టాఫ్ న‌ర్సుతో పాటు అటెండ‌ర్ ఉంటారని చెప్పారు. అన్ని బ‌స్తీ ద‌వాఖానాల‌ను తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌తో అనుసంధానం చేశామ‌న్నారు.

- Advertisement -