మంత్రి ఎర్రబెల్లి పీఏ,గన్‌మెన్‌లకు కరోనా

151
errabelli

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేలకు చేరవయ్యాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారీన పడగా తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏ,గన్‌మెన్‌లకు కరోనా సోకింది.

ఈ నెల 21న వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉన్న పీఏలు, గన్‌మన్లు, సహాయకులు మొత్తం 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్‌ అని తేలింది. వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు 3,37,771 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ప్రస్తుతం 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 455 మంది మృతి చెందారు.