14 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

158
india coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలకు చేరువైంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 48,661 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 705 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

దీంతో ఇప్పటివరకు 13,85,522 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 32,063 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,67,882 యాక్టివ్ కేసులు ఉండగా 8,85,577 మంది క‌రోనా మహమ్మారి నుండి కొలుకున్నారు.

దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 63.54 శాతంగా ఉండగా గ‌త 24 గంట‌ల్లో 4,42,031 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఆరోగ్య శాఖ ప్రకటించింది.జూలై 25 వ‌ర‌కు 1,62,91,331 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది. ప్ర‌భుత్వ ఆధ్వ‌‌ర్యంలోని ల్యాబుల్లో 3,62,153 టెస్టులు చేయగా ప్రైవేట్ ల్యాబుల్లో ఒకేరోజు 79,878 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని పేర్కొంది.