ఐపీఎల్‌పై సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు!

191
sangakkara
- Advertisement -

ఐపీఎల్ 2020 కోసం యూఏఈ సిద్దమవుతోంది. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానుండగా నెలరోజుల ముందే అన్ని ప్రాంఛైజీలు ఆటగాళ్లతో యూఏఈ చేరుకోనున్నాయి. నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ స్టార్ ఆటగాడు కుమార సంగక్కర ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల యూఏఈ ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాక, ప్రజలను కరోనా ఆలోచననుండి కొంత బయటకు తీసుకురావడానికి దోహద పడుతుందని తెలిపారు.

ఇప్పటివరకు ఐపీఎల్ రెండు సార్లు మాత్రమే విదేశాల్లో జరిగింది. 2009 దక్షిణాఫ్రికా లో పూర్తి సీజన్ జరుగగా 2014 యూఏఈ లో సగం సీజన్ జరిగింది. ఈ సారి పూర్తిస్ధాయిలో ఐపీఎల్ యూఏఈలో జరగనుంది.

ఐపీఎల్‌లో 5 సీజన్లకు ప్రాతినిధ్యం వహించారు సంగక్కర. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, డక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగక్కర సన్ రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా పనిచేశారు.

- Advertisement -