ప్రతీగ్రామంలో రైతు సంఘం: మంత్రి ఎర్రబెల్లి

132
erraebelli
- Advertisement -

ప్రతీ గ్రామంలో మహిళా రైతు సంఘం ఏర్పాటుకావాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మ‌హిళ‌ల ద‌గ్గ‌రుండే డ‌బ్బు ఎప్ప‌టికీ వృధాకాద‌ని…అందుకే సీఎం కేసీఆర్ రుణాల‌న్నింటినీ మాఫీ చేశార‌ని వెల్ల‌డించారు. చెన్నారావుపేటలో అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యకు ప్రభుత్వం అందించిన వ్యవసాయ యంత్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి మ‌హిళ‌లు కూడా ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించే స్థాయికి ఎద‌గాల‌న్నారు. ఐకేపీ సంఘాల ద్వారా వ‌చ్చిన రుణాల‌తో ఏవైనా ఉత్ప‌త్తుల త‌యారీని ప్రారంభించాల‌ని సూచించారు.

మహిళలు తాము తీసుకున్న రుణాల‌ను 100 శాతం తిరిగి చెల్లిస్తార‌ని… చెన్నారావుపేట‌లో ప‌రిశ్ర‌మ‌ల‌ ఏర్పాటుకు అన్నిరకాల స‌హాయ సహకాలు అందిస్తాన‌ని చెప్పారు. యువ‌త స్వయం ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టికేంద్రీక‌రించాల‌ని సూచించారు.

- Advertisement -