ఆహ్లాదకరంగా హైదరాబాద్ వాతావరణం:కంగనా

125
kangana

కొద్దిరోజులుగా కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ కంగనా రనౌత్. మహారాష్ట్ర సర్కార్‌తో వివాదం కొనసాగుతుండగానే మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంది కంగనా. ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుండగా జయలలిత తొలినాటి రాజకీయ జీవితానికి సంబంధించిన ముఖ్యఘట్టాల్ని తాజా షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ వాతావరణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.హైద‌రాబాద్ అందంగా, ఆహ్లాద‌క‌రంగా ఉంది. ఇక్క‌డి వాతావ‌ర‌ణం హిమాల‌యాల‌ని త‌ల‌పిస్తుంది. సూర్యోద‌యం స‌మయం మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంద‌ని కంగనా పేర్కొంది.