ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి- ఎర్ర‌బెల్లి

170
minister errabeli
- Advertisement -

మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు మంగళవారం వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్పిట‌ల్ లో పిపిఇ కిట్ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంతు, న‌గ‌ర క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ఎంజిఎం సూప‌రింటెండెంట్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య‌ సిబ్బంది సేవలు ప్రశంసనీయం. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్న వాళ్ళ‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన‌, మంచి సేవ‌లు అందించాలి. వ‌రంగ‌ల్ చుట్టుముట్టు జిల్లాల‌కు ఎంజిఎం కేంద్రంగా అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ది. ఇక్క‌డ ప‌ని చేస్తున్న వైద్యుల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా టెలీ మెడిసిన్ సేవలను కూడా అందిస్తుండ‌టం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ సహాకారం, దాతల సహాయంతో ఎంజిఎం వైద్య‌శాల‌లో మ‌రిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు శాయశక్తులా కృషిచేస్తా. రాష్ట్రంలో రెండో రాజ‌ధానిగా ఉన్న వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న‌ది. వైద్యరంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయ‌డానికి ప్రభుత్వం ప్ర‌త్యేక కృషి చేస్తున్న‌ది.

ప్ర‌జ‌ల‌కు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్న వైద్యులపై దాడులు దురదృష్టం, బాధాక‌రం.ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు, వైద్యుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాలి.వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు త‌ప్ప‌వు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..సిఎం కెసిఆర్ నేతృత్వంలో పేదల కోసం ప్రభుత్వం ప‌ని చేస్తున్న‌ది. మే 7 వరకు లాక్ డౌన్ విధించ‌బ‌డి ఉంది. అ ప్ప‌టి దాకా పకడ్బందీగా లాక్ డౌన్ ని అమలు చేయాలని మంత్రి అన్నారు.

అప్ప‌టికి ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి లాక్ డౌన్ ని పోడిగించినా స‌రే, ప్రజలు సహాకరించాలి.ప్ర‌భుత్వం, సిఎం కెసిఆర్, ప్ర‌జ‌ల కోస‌మే ఇదంతా చేస్తున్నారు.ఒక‌సారి మ‌న చేతులు దాటితే, క‌రోనా వైర‌స్ ని కంట్రోల్ చేయ‌లేం. పెద్ద పెద్ద దేశాలే క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నాయి. మిగ‌తా దేశాలు, రాష్ట్రాల‌తో పోలిస్తే, తెలంగాణ‌లో క‌రోనా కంట్రోల్ లో ఉంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -