సీఎం జగన్ బర్త్‌డే.. మొక్కలు నాటిన మంత్రి..

26

సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను పండగలా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ బర్త్‌డేకు మొక్కలు నాటారు. అనంతరం మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తండ్రిని మించిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ వెంట సైనికుడిలా పనిచేస్తా అన్నారు. సిద్ధాంతాలు వదిలి అన్ని పార్టీలు ఏకమయ్యాయి.. ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా జనం సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు.. ఈ రోజు మరో మంచి పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌లు చేసి ఇవ్వబోతున్నాము. దాన్ని కూడా అడ్డుకొనేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.