మెక్సికో అధ్యక్షుడికి కరోనా..

78
mexico

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పలు దేశాల్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖం పడుతుండగా అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

ఇక తాజాగా మెక్సికో అధ్య‌క్షుడు ఆండ్రెస్‌ మ్యానుయ‌ల్ లోపేజ్ ఒబ్రాడార్‌కు కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఒబ్రాడర్‌.. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ త‌న‌లో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ని చెప్పారు. వైద్యుల సూచ‌న మేర‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని…త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అందుబాటులోకి వస్తానని తెలిపారు. ఇదిఇలా ఉండగా కరోనాతో ఇప్పటివరకు మెక్సికోలో 1,49,614 మంది మృతి చెందారు.