ఫీవర్‌ కారణంగా ప్రీ రిలీజ్‌కి రాలేకపోతున్న హీరోయిన్‌..

246

యాక్ష‌న్ స్టార్ గోపీచంద్-మెహరీన్ కాంబినేషన్‌లో కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం పంతం. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. గోపిచంద్ నటించిన 25వ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగింది.

Mehreen Pirzada

ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ సందర్భంగా, ఈ సినిమాలో కథానాయికగా నటించిన మెహ్రీన్ తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని ట్వీటర్‌ ద్వారా తెలియజేసింది. తన ఆరోగ్యం సహకరించడం వలన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకాలేకపోతున్నాని తెలిపింది. ఈ సినిమాను హైదరాబాద్‌లో జులై 5న మనమంతా కలిసి సినిమా చూద్దాం’ అంటూ తన ట్వీట్‌ చేసింది.