రెండో మూవీకి సిద్ద‌మైన చిరు చిన్నల్లుడు..

408
Kalyan dev

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మ‌రో హీరో చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన సినిమా విజేత‌. ఈమూవీ ఘ‌న విజ‌యం సాధించడంతో చిరంజీవి సంతోషంగా ఉన్నాడు. ఈమూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుండ‌టంతో పాటు బాక్సాఫిస్ వ‌ద్ద భారీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది. ఇక ఈసినిమా చూసిన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు క‌ళ్యాణ్ దేవ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. మొద‌టి సినిమాలోనే అద్భుత‌మైన న‌ట‌న‌తో డ్యాన్సుల‌తో ప్రేక్షుకుల‌ను అల‌రించాడు.

kalyan dev vijetha

ఈసినిమాకు రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..సాయి కొర్ర‌పాటి నిర్మించారు. క‌ళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న మాళ‌విక నాయ‌ర్ హీరోయిన్ గా న‌టించింది. తొలి సినిమా తోనే యూత్ , ఫ్యామిలీ ఆడియెన్స్ కు న‌చ్చేలా సినిమా తీశాడు. ఎటువంటి అంచానాలు లేకుండా విడుద‌లైన ఈసినిమా చూడ‌డానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్నారు. మొద‌టి సినిమా హిట్ కొట్ట‌డంతో రెండ‌వ సినిమాపై క‌న్నేశాడు క‌ళ్యాణ్ దేవ్ .

kalyan dev

మొద‌టి సినిమాలో ల‌వ్ అండ్ సెంటిమెంట్ తో వ‌చ్చిన క‌ళ్యాణ్ త‌న త‌రువాతి సినిమా మాస్ ఆడియ‌న్స్ కి కెనెక్ట్ అయ్యేలా తీయ‌నున్నాడ‌ని స‌మ‌చారం. ఇప్ప‌టికే క‌ళ్యాణ్ ప‌లు స్టోరీలు విన్నాడ‌ని త్వ‌ర‌లోనే త‌న త‌ర్వాతి సినిమా గురించి పూర్తి వివరాలు వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. మొద‌టి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన క‌ళ్యాణ్ దేవ్ త‌న త‌రువాతి సినిమా ఎలా ఉండ‌నుంద‌ని మెగా అభిమానుల్లో ఆస‌క్తి రేగుతుంది.