ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్ లో నాని, శ‌ర్వానంద్..

242
indraganti, dil raju
- Advertisement -

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం బ‌యోపిక్, మ‌ల్టీస్టార‌ర్ ల ట్రెండ్ న‌డుస్తుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న యువ హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు తీస్తున్నారు. ఇద్ద‌రు హీరోలు ఒకే సినిమాలో క‌నిపిస్తే అభిమానుల్లో కూడా ఉత్సాహం ఎక్క‌వవుతుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. పెద్ద హీరోల‌తో యువ హీరోలను జోడి చేసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు తీసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. నాగార్జున నాని కాంబినేష‌న్ లో దేవ‌దాస్ మూవీ చేస్తుండ‌గా, వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో ఎఫ్ మూవీ ని చిత్రిక‌రిస్తున్నారు.

sharwanand-nani

అయితే తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. తాజాగా దిల్ రాజు వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో ఎఫ్ 2 మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈసినిమాకు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మోహ‌నం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌న త‌ర్వాతి సినిమా మల్టీస్టార‌ర్ తీయ‌నున్న‌ట్లు తెలిపాడు.

Dil-Raju, Sharwanand

ఈమూవీని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. వ‌రుసగా సినిమాలు చేసుకుంటు వెళుతున్నాడు దిల్ రాజు. ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే మ‌ల్టీస్టార‌ర్ మూవీకి హీరోలను క‌న్ఫామ్ చేశార‌ని తెలుస్తుంది. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈమూవీలో హీరోలుగా ఇద్ద‌రు యువ హీరోలును తీసుకున్న‌ట్లు స‌మాచారం. నాని, శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో దిల్ రాజు మ‌ల్టీస్టార‌ర్ ను తెర‌కెక్కించున్న‌ట్లు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఇంద్ర‌గంటి గ‌తంలో నానితో జంటిల్ మెన్ సినిమాతీసి స‌క్సెస్ సాధించాడు.

- Advertisement -