గుడ్డుకూర వండలేదని చంపేశాడు..

199
eggcurry

సినిమాల  ్రపభావమో.. సీరియల్స్  ప్రభావమో.. తెలియదు కానీ మనుషులలో రోజు రోజుకు క్రూరత్వం పెరిగిపోతోంది.. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో కట్టుకున్న వాళ్లనే చంపేస్తున్నారు. గత కొలం నుంచి ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కోడి గుడ్డుకూర వండలేదని భార్యను చంపేశాడు ఓ భర్త. మద్యం మత్తులో ఉన్న భర్త.. తండ్రి తుపాకీతో భార్యను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..

Woman-Shot-Dead

ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ జిల్లాలోని దేవ్ గ్రామానికి చెందిన నవనీత్(33), మంగేశ్ శుక్లా(30) ఇద్దరు దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం వివాహం జరగగా… నవనీత్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో తాగుడుకు బానిసయ్యాడు నవనీత్. రోజు మాదిరిగా గురువారం కూడా ఫుల్ గా తాగి ఇంటికి వచ్చాడు. కోడి గుడ్డు కూర వండాలని భార్యను వత్తిడి చేశాడు. భార్య ససెమిరా అనడంతో మత్తులో ఉన్న నవనీత్.. తన తండ్రి లైసెన్స్ డ్ గన్ తో భార్యపై తూటాల వర్షం కురిపించాడు.

తూటాల దెబ్బకి వెంటనే కుప్పకూలిపోయింది శుక్లా. తూటాల శబ్ధం విన్న స్థానికులు వచ్చి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న శుక్లాను ఆస్పత్రికి తలించే ప్రయత్నం చేశారు.. కానీ అంతలోనే చనిపోయింది. మృతిరాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జైలుకు తరలించారు.