రామ్ చరణ్‌కు డాక్టరేట్..

7
- Advertisement -

నటుడు రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకి చెందిన ప్రముఖ యూనివర్సిటీ వేల్స్..చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించింది. కళా రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలకు గాను డాక్టరేట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 13న జరగనున్న వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో డాక్టరేట్‌ను బహుకరించనుండగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. రామ్ చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించిన నేపథ్యంలో పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నా చరణ్. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక RC16 వర్కింగ్ టైటిల్‌తో ఉప్పున ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు చరణ్. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -