బిగ్ బాస్ 5..ఈసారి నాగబాబు సపోర్ట్ ఎవరికో తెలుసా?

136
naga babu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సక్సెస్‌ ఫుల్‌గా సాగుతోంది. బిగ్ హౌస్‌లోకి 19 మంది కంటెస్టెంట్స్‌ వెళ్లగా లోబో నవ్వులు పూయిస్తుండగా తొలి రోజు నుండే కొంతమంది కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు ఉండగా ఫస్ట్ వీక్ ఎవరూ ఎలిమినేట్ అవుతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

అయితే ఇప్పటివరకు బాగానే ఉన్న మెగాబ్రదర్ నాగబాబు బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత సీజన్లో నాగబాబు మద్దతిచ్చిన అభిజిత్ విన్నర్‌గా నిలవగా ఈసారి కూడా తాను ఎవరికి సపోర్టు చేస్తున్నానో తేల్చి చెప్పారు నాగబాబు.

తనకు యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియ, నటరాజ్ మాస్టర్ అంటే ఇష్టమని ఆయన చెప్పారు. కానీ ట్రాన్స్-ఉమెన్ ప్రియాంకకు తన పూర్తి మద్దతును అందిస్తున్నట్లు తెలిపారు.ప్రియాంక జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొందని… అమ్మాయిగా మారిన తర్వాత ఆమెకు అవకాశాలు రానప్పుడు నాగబాబు ఎలా సహాయం చేశాడో కూడా గుర్తు చేసుకున్నాడు. ప్రియాంకకే తన పూర్తి సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ప్రియాంక తన కెరీర్‌ని ‘జబర్దస్త్‌’తో సాయి తేజగా ప్రారంభించి, తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తెలిసిందే.