పవర్‌ స్టార్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిహారిక..

154
- Advertisement -

మెగా డాటర్‌ నిహారిక కొనిదేల పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు జనసేన పార్టీ ఆర్థికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ క్రమంలో నిహారి స్పందించారు.

“ప్రజలకు ఆశావాద, విశ్వాసంతో కూడిన భవిష్యత్ ను నిర్మించాలనే మీ బృహత్తర ప్రయత్నంలో ఉడుతాభక్తిగా సాయపడేందుకు మాకు అవకాశం కల్పించారు. థాంక్యూ కల్యాణ్ బాబాయ్. నా దృష్టిలో ఎప్పటికీ నాయకుడు అంటే నువ్వే బాబాయ్. మెరుగైన భవిష్యత్ నీతోనే సాధ్యం” అంటూ నీహారిక ట్వీట్ చేశారు.

- Advertisement -