టాలీవుడ్ డ్రగ్స్ కేసు…ఈడీ ముందుకు రవితేజ

74
Ravi

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు సినీ నటులు పూరి జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానాలను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ మాస్ మహారాజా రవితేజపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. రవితేజతో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రవితేజను విచారించనుంది.