బిగ్ బాస్..ఆలు కర్రీ కోసం రచ్చ..!

115
bb5

బిగ్ బాస్ 4వ సీజన్‌లో కరాటే కళ్యాణి,అరియానా గ్లోరిల మధ్య జరిగిన గొడవ అందరికి గుర్తుండే ఉంటుంది. తనకు ఆలూ కూర పెట్టమంటే పెట్టలేదని ఫీల్ అయిపోయిన అరియానా తర్వాతి వారంలో కరాటే కళ్యాణిని నామినేట్ చేయగా ఆ వారంలో ఆమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ వరకు వెళ్లకపోయినా ఆలు కర్రీ కోసం రచ్చ రచ్చ జరిగింది. ఆలూ కర్రీ కోసం ఉమాదేవి, ఆనీ మాస్టర్‌ల మధ్య గొడవ చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

ఆలూ కూర తనకు వడ్డించకుండా ఫ్రిజ్‌లో పెట్టారని యానీ మాస్టర్‌ మీద మండిపడింది ఉమాదేవి. నేను అడిగినప్పుడు కూర లేదన్నారు, మరి ఇప్పుడెలా ఉందని నిలదీసింది. నటరాజ్ మాస్టర్ వచ్చి.. ఆమెకు ఆలూ కర్రీ ఇచ్చేయండి అని గట్టిగా అరిచాడు. దీంతో నాకు ఇప్పుడు ఇచ్చేది ఏంటి?? నేనేం అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు.. భిక్షం ఎత్తుకోవడం లేదు. తినడానికి రాలేదు.. తినడానికి అడిగినప్పుడు ఉందంటే ఉందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి అంతే కానీ ఇలా చేయకూడదు అంటూ చెప్పేసింది ఉమా.

తర్వాత ఆలు కర్రీ పక్కన పెట్టడానికి గల రీజన్‌ను చెప్పింది ఆనీ మాస్టర్. తాను ఒకరి కోసం అని దాచలేదు.. ఏ కర్రీ చేసిన కొంచెం తీసి పక్కనపెట్టమని మిగిలిన వాళ్లకీ చెప్పాను.. ఎందుకంటే ఫస్ట్ తింటున్నప్పుడు కర్రీ ఒకేసారి అయిపోతుంది.. వెనుకన ఉన్నవాళ్లకి ఉండటం లేదని అలా చేస్తున్నాం అని చెప్పగా మళ్లీ కౌంటర్ వేసింది ఉమా. మాట మాట పెరుగగా చివరకు ఆనీ మాస్టర్ ఇది తన మిస్టేక్ అని చెప్పడంతో ఉమాదేవి శాంతించింది.