టెన్జింగ్ నార్గే..ఎవరెస్ట్‌ రారాజు

52
- Advertisement -

బ్రిటీష్‌ వలస పాలన కాలం నుంచే భారతదేశంలో భౌగోళిక అంశాలపై అనేక అధ్యయనాలు చేయడం ప్రారంభించారు. 1802లో విలియం లాంబ్టన్ భారతదేశ దక్షిణ తీరం నుంచి ఉత్తారన హిమాలయాలకు వరకు వివిధ ప్రదేశాలను ఎత్తులను నిర్థారించారు. అయితే ఈ సర్వేను జార్జ్ ఎవరెస్ట్‌ పూర్తిచేయగా…ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతంను కనుగొన్న వ్యక్తిగా చరిత్రకెక్కారు. దాంతో ఆ పర్వతం పేరును ఎవరెస్ట్‌గా పిలవడం మొదలుపెట్టారు.

జార్జ్ ఎవరెస్ట్‌ పర్వతంను లెక్కించిన దాన్ని ఎక్కే సాహసం చేయలేదు. కానీ 1953లో ఓ వ్యక్తి ఆ పర్వతాన్ని ఎక్కి చరిత్ర పుటలో శాశ్వతంగా నిలిచారు. అతన్నే టెన్జింగ్ నార్గే. ఇతను 1914,మే 15న టెన్జింగ్ నార్గే టిబెట్‌లో జన్మించారు. ఈయన 19 సంవత్సరాల వయస్సులో షిప్టన్ అనే బ్రిటీష్‌ నిఘా యాత్రకు పోర్టర్‌గా ఎంపికయ్యారు. అప్పటినుంచి పర్వతాలను ఎక్కడం నేర్చుకొని తర్వాతి కాలంలో షెర్ఫాల సంఘంలో స్థిరపడ్డారు. అయితే ఈయన మొదటి సారిగా న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీతో పాటు ఎవరెస్ట్ శిఖరంను 1953లో అధిరోహించారు. 20వేల అడుగుల కన్నా ఎత్తైన శిఖరాలను 26సార్లు అధిరోహించిన వ్యక్తిగా నిలిచారు. నార్గే ఎవరెస్ట్‌ శిఖరానికి 6సార్లు వెళ్లారు.

Also Read: గోపాల్ కృష్ణ గోఖలే…దేశం కోసమే జీవితం అంకితం

నార్గేకు ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. ఈయన్న 1986, మే9న డార్జిలింగ్‌లో మరణించారు. అయన్నికి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ నేపాల్ (1953) ప్రభుత్వం ప్రకటించారు. బ్రిటీష్ ప్రభుత్వం జార్జ్‌ మెడల్‌ మరియు క్వీన్ ఎలిజబెత్2 పట్టాభిషేక పతకంను 1953లో సాధించారు. 1959లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పతకంను సాధించారు. టెన్జింగ్ నార్గే 1978లో మార్గదర్శక సంస్థను స్థాపించారు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్‌లో 20వ శతాబ్ధపు అత్యంత ప్రభావంతమైన మొదటి 100మందిలో ఒకరిగా నిలిచారు.

Also Read: మేవాడ్ వీరుడు..మహారాణా ప్రతాప్

- Advertisement -