ఒత్తిడిని చిత్తు చేసే ‘బతిలాసనం’

52
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ద వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యంపై అశ్రద్ద వహించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల మానసికంగానూ, శరీరకంగాను ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం, యోగా వంటివి చాలా అవసరం. శారీరక శ్రమ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. ఇక ప్రతి రోజు యోగా చ్యెయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రోజుకు కనీసం ఒక 30 నిముషాలు యోగాసనాలకు కేటాయిస్తే శరీరకంగా, మానసికంగా ఎంతో యాక్టివ్ గా ఉండవచ్చు. యోగాసనాలలో బతిలాసనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆసనం వల్ల మానసిక వొత్తిడి తగ్గుతుంది. అలాగే వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ ఆసనం వేయడానికి కూడా ఎంతో సులభంగా ఉంటుంది కాబట్టి ఏ వయసు వారైనా చాలా ఈజీగా ఈ ఆసనం వేయవచ్చు.

బతిలాసనం ఏ విధంగా వేయాలంటే.. ముందుగా ఆవులా మోకాళ్ళ మీద నిలబడి చేతుల సపోర్ట్ తో ముందుకు వంగాలి. భుజాలు మరియు ఛాతీ బరువంటా అరచేతులపై పడేలా చూసుకోవాలి. మీ నడుము బరువు మోకళ్లపై పడేలా చూసుకొని, ఆ సమయంలో కాలి వెళ్ళను మడిచి ఉంచి కాళ్ళను రిలాక్స్ గా ఉంచాలి. ఇలా వేసిన తరువాత ఊపిరి గట్టిగా తీసుకొని కొద్ది సేపు పట్టిఉంచి ఆ తరువాత నెమ్మదిగా వాడలాలి. గాలి పోల్చుకున్నప్పుడు పొట్ట వెన్ను కిందకి, వదులుతున్నప్పుడు వెన్ను పైకి కదిలించాలి. ఇక కనీసం 10-15 సార్లు చేయాలి. ఈ బతిలాసనం ద్వారా వెన్నునోట్టి సమస్యలు తగ్గడంతో పాటు మలబద్దకం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

Also Read:టమాటా జ్యూస్ తాగితే ప్రమాదమా?

- Advertisement -