మేవాడ్ వీరుడు..మహారాణా ప్రతాప్

112
- Advertisement -

అతడి కళ్లల్లో వీరత్వం తొనికిసలాడుతుంది. మేవాడ్ వీరుడుగా పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు చూపాడు మహారాణా ప్రతాప్. రాజస్థాన్‌లోని కుంబల్‌లో 9 మే 1540లో జన్మించారు. గొప్ప చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొన్న అక్బర్ ఆ సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్రం, ఆత్మ గౌరవం కోసం నిరంతంరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తలవంచలేదు.

Also Read:మేమ్ ఫేమస్..థియేట్రికల్ రిలీజ్

మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్లమీద పడితే సగం హిందూస్థాన్‌కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే, దాన్ని తుచ్ఛమైందిగా తిరస్కరించాడు. రాణాప్రతాప్ వాడిన ఈటె బరువు 80 కిలోలు, కవచం 80 కిలోలు బరువు ఉంటాయి. రాణా ప్రతాప్ వాడిన కత్తితో కలిపి 207 కిలోలు ఉండేవి. ఇవన్నీ ఉదయ్‌పూర్ మ్యూజియంలో ఉన్నాయి.

Also Read:నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు..

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం. అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదని అన్నాడు. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏమంటే శక్తివతంమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను…. అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్దనీతి, ప్రయోగాలతో విజయం సాధించాం అని అన్నాడు . ఆ రాజు పేరు మహారాణా ప్రతాప్ అని గొప్పగా చెప్పారు.

Also Read:KTR: ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌కు ఆగం కావొద్దు

- Advertisement -