IPL 2024:ప్లేఆఫ్స్ నుండి ముంబై ఔట్

23
- Advertisement -

ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన ముంబై… కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. మిగతా ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. రన్ రేట్ కూడా -0.212గా ఉంది.

పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు 2013, 2015, 2017, 2019, 2020లో విజయం సాధించింది ముంబై. కానీ ఈ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేకపోయింది.

బుధవారం ఉప్పల్లో జరిగిన మ్యాచులో లక్నోపై హైదరాబాద్ ఘన విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్…మరో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కి చేరినట్లే. ఇక కేకేఆర్,రాజస్థాన్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరుకోగా ఇగిలిన రెండు స్థానాల కోసం హైదరాబాద్,చెన్నై,డీసీలక్కో పోటీ పడుతున్నాయి.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -