ఆకట్టుకుంటున్న ‘వృష‌భ’ ట్రైల‌ర్

9
- Advertisement -

వీకే మూవీస్ & శ్రీ జె పి ప్రొడక్షన్స్ ప‌తాకాలపై జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం వృష‌భ‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మం దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి జయంతి సందర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ…`ట్రైల‌ర్ తో పాటు ఒక పాట విన్నాం చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా ఉన్నారు. ద‌ర్శ‌కుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని కోరుకుంటూ నిర్మాత‌కు శుభాకాంక్ష‌లు ` అన్నారు.

ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ…`ట్రైల‌ర్ చూడ‌గానే ఇది డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి కూతురు నిర్మాత‌గా చేయ‌డం సంతోషం. ఈ చిత్రం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు` అన్నారు.

సీనియ‌ర్ నిర్మాత దామోదర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ…“ ట్రైల‌ర్, విన్న పాట , టైటిల్ చాలా బావున్నాయి. క‌ళ ప‌ట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు. ల‌యన్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ…`జ‌య ప్ర‌కాష్ రెడ్డి కూతురు ఈ సినిమాతో కో ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ట్రైల‌ర్, మ్యూజిక్ బాగుంది. గోమాత మీద సినిమా తీయ‌డం ఇదే ప్ర‌థమం. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా` అన్నారు.

న‌టుడు అజ‌య్ ఘోష్ మాట్లాడుతూ…`జేపీ గారి కుమార్తె మ‌ల్లికా రెడ్డి  కోసం ఈ ప్రోగ్రామ్ కి వ‌చ్చాను. మ‌ట్టి వాస‌న‌తో కూడిన క‌థ ఇది. ట్రైల‌ర్… నేచ‌ర‌ల్ గా చాలా బావుంది. ఇలాంటి క‌థ‌లతో సినిమాలు మ‌రెన్నో చేయాల‌ని కోరుకుంటూ ఈ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు` అన్నారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -