ఉప్పును తక్కువగా తీసుకోండి..లేకుంటే!

7
- Advertisement -

ఉప్పు లేనిదే ఏ వంకటం కూడా రుచిగా అనిపించదు. కూరలో ఉప్పు లేకపోతే ఎన్ని మసాలాలు వేసి గుమగుమలాడే విధంగా చేసిన అదంతా వ్యర్థమే. అందుకే ఉప్పును వంటకాలకు గుండెకాయగా చెబుతుంటారు పెద్దలు. మనం సాధారణంగా వంటల్లో ఉపయోగించే ఉప్పు తెల్లగా ఉంటుంది.

అయితే అతి ఏదైనా అనర్థమే. అధిక మొత్తంలో సోడియం తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఆహారంలో తక్కువ సోడియం వినియోగంతో ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల హైబీపీ వస్తుంది. సోడియం తగ్గిస్తే రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సోడియం తక్కువగా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.హైబీపీ అనేది స్ట్రోక్‌కు ప్రధాన కారణం. మెరుగైన ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును పొందవచ్చు. అధిక ఉప్పును వినియోగిస్తే మూత్రపిండాలు దెబ్బతినడానికి, కాలక్రమేణా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. అధిక సోడియంతో కాలక్రమేణా ఎముకలను బలహీనపరుస్తుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -