MAY28:వీర్ సావర్కర్ బర్త్‌డే

59
- Advertisement -

వీర్ సావర్కర్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తనదైన శైలిలో పోరాడిన భారతీయుడు. అసలు పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన మహారాష్ట్రలోని నాసిక్‌లో దామోదర్ మరియు రాధాబాయి సావర్కర్‌లకు మే 28,1883న జన్మంచారు. కాగా నేడు ఆయన పుట్టినరోజు. అఖండ భారత్ లక్ష్యంగా పనిచేసిన వాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

హిందూమతం యొక్క ఆలోచనలను ప్రచారం చేశారు. ఇతను కేవలం 15 సంవత్సరాల కాలంలో మిత్రమేళా అనే యువజన సంస్థను స్థాపించారు. దీన్ని జాతీయవాద ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం దీన్ని మొదటి లక్ష్యం. విదేశి వస్తువుల బహిష్కరణ భారతీయులు చేస్తున్న తరుణంలో వీర్ సావర్కర్ మాత్రం దసరా రోజున విదేశీ వస్తువులను తగులబెట్టిన ఏకైక వ్యక్తి. మోర్లీ మాంటీ సంస్కరణలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసినందుకుగాను 1909లో సావర్కర్‌లో జైలులో ఉంచబడ్డారు. అనంతరం 1911లో అండమాన్‌లోని సెల్యూలార్ జైలులో అతనికి రెండు జీవిత ఖైదు శిక్ష విధించబడింది.

Also Read: PMMODI:దేశ ప్రజలందరూ గర్వపడాలి

జైలు నుండి విడుదలయ్యాక సావర్కర్ మహారాష్ట్రలోని రత్నగిరిలో అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు. కులతత్వం మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. మొదటి నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను విమర్శించిన సావర్కర్‌…భారతదేశ విభజనను కూడా అంగీకరించలేదు. 1857నాటి సిపాయిల తిరుగుబాటుకు ఉపయోగించిన గెరిల్లా యుద్ద తంత్రాలను ది హిస్టరీ ఆఫ్‌ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండిన్స్ అనే పుస్తకంలో వివరించారు. అండమాన్‌లోని పోర్ట్‌ బ్లెయిర్‌ విమానాశ్రయంకు 2002లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టారు. వీర్ సావార్కర్‌ 1966న ఫిబ్రవరి26న తుది శ్వాస విడిచారు.

Also Read: PMMODI:ఎన్టీఆర్ యుగపురుషుడు

- Advertisement -