నిర్మల్‌…జూన్‌4న సీఎం కేసీఆర్ టూర్‌

41
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వేళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని జూన్ 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.  అలాగే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కలెక్టర్ వరుణ్‌రెడ్డి సంబంధిత జిల్లా అధికారులతో నూతన సమీకృత కలెక్టరేట్‌ సముదాయంను కొత్త బీఆర్ఎస్ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని,హెలిప్యాడ్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్షమందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు.  ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. జిల్లా బీఆర్ఎస్‌ కార్యాలయంను కూడా ప్రారంభిస్తారని మంత్రి అన్నారు. అనంతరం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.

Also Read: CMKCR:మోదీ ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్ లో  భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గడిచిన 9యేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. జూన్‌ 2నాటికే అన్ని పనులు పూర్తి చేయాలని సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన  తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Also Read: నాన్ బీజేపీ పార్టీలు ఒక్కటి కావాలి: అరవింద్

- Advertisement -