తెలంగాణకు మమతాబెనర్జీ రూ. 2 కోట్ల విరాళం..

245
Mamata Banerjee

గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు చాలామంది పేదలు ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మంగళవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజానీకానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫోన్లో మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తెలంగాణా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మమతా బెనర్జీ తెలిపారు.