రాష్ట్రంలో మరో 3రోజుల పాటు భారీ వర్షాలు..

205
telangana rains
- Advertisement -

మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అదే ప్రాంతములో ఈరోజు(అక్టోబరు 20 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రముగా మారే అవకాశం ఉంది. ప్రారంభములో ఇది రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ ద్రోణి Lat.15.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మరియు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధముగా కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, ఎల్లుండి చాలాచోట్ల రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట మరియు జనగామ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

- Advertisement -